ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్(rgv missing trailer) విడుదలైంది. ఏపీ పాలిటిక్స్‌ను పోలి ఉండేలా ఈ సినిమాను వర్మ మలిచాడని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. పవన్ కల్యాణ్, చంద్రబాబుతో పాటు పలువురు డూపులతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్లో తెలుస్తోంది.
rgv missing trailer: ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ విడుదల - ఆర్జీవీ
అంశమేదైనా సరే తనదైన శైలిలో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(RGV). తాజాగా ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్‌ను(rgv missing trailer) వర్మ విడుదల చేశాడు. ఏపీ పాలిటిక్స్‌ను పోలి ఉండేలా సినిమాను తీసిన నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
రాంగోపాల్ వర్మ(RGV) ఏ సినిమా తీసినా అది సంచలనమే అవుతోంది. అలాంటిది ఆర్జీవీ మిస్సింగ్(rgv missing) సినిమా ఎంతగా సంచలనం అవుతుందో.. వివాదాల్లో చిక్కుకుంటుందో వేచి చూడాలి. రాంగోపాల్ వర్మ(ram gopal varma movies) 'ఆశ ఎన్కౌంటర్' ట్రైలర్(disha encounter movie trailer) ఇటీవల రిలీజైంది. తెలంగాణలో 2019 నవంబరు 26న జరిగిన గ్యాంగ్‌రేప్ ఆధారంగా ఈ సినిమా తీసినట్లు ఆయన ట్వీట్ చేశారు. నవంబరు 26న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:Movie Updates: బంగార్రాజు డైరీ బ్యూటీ.. సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్