జాతీయ కర్మచారి కమిషన్ సభ్యులు జగదీశ్ హీరమణి జీహెచ్ఎంసీ కార్యాలయంలో కర్మచారి ప్రతినిధులతో భేటీ అయ్యారు. గ్రేటర్ పరిధిలో విధి నిర్వహణలో మరణించిన పొరుగు సేవల పారిశుద్ధ్య కార్మికులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించే విధానం తీసుకురావాలన్నారు. ఇప్పటికే ఈ విధానం బెంగళూరు నగర పాలక సంస్థ పరిధిలో అమలుచేస్తున్నట్లు తెలిపారు. సఫాయి కర్మచారిలకు అన్యాయం జరుగుతోందని జగదీశ్ హీరమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
'సఫాయి కర్మచారులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి'
జీహెచ్ఎంసీ కార్యాలయంలో సఫాయి కర్మచారి ప్రతినిధులతో జాతీయ కమిషన్ సభ్యులు జగదీశ్ హీరమణి సమావేశం నిర్వహించారు.
'సఫాయి కర్మచారులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి'