ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన గురించి స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం కానీ, సమాచారం కానీ అందలేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటన వ్యక్తిగతం కాదని, భాజపా సొంత కార్యక్రమం అంతకంటే కాదని పేర్కొన్నారు.
మోదీ పర్యటన గురించి నాకు సమాచారమివ్వలేదు: రేవంత్ - మోదీ పర్యటన వార్తలు
కొవాక్జిన్ పురోగతిపై ప్రధాని మోదీ.. ఈ రోజు హైదరాబాద్‌ను సందర్శించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై తనకు ఎటువంటి సమాచారం కానీ, ఆహ్వానం కానీ అందలేదని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది ప్రొటోకాల్ ఉల్లంఘన, సాంప్రదాయాలకు విరుద్ధమని మండిపడ్డారు.
మోదీ పర్యటన గురించి నాకు సమాచారమివ్వలేదు: రేవంత్
ఇది స్థానిక ప్రజాప్రతినిధిని తీవ్రంగా అవమానించడమే గాక ప్రోటోకాల్ ఉల్లంఘన, సాంప్రదాయాలకు విరుద్దమని ఆరోపించారు. ఈ విషయాన్ని లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి, తన నిరసన వ్యక్తం చేస్తానని అన్నారు. లోక్ సభ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని తెలిపారు.
ఇదీ చదవండి:గ్రేటర్ పోరు: సాంకేతిక మీట.. ప్రచార బాట!