గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి జ్యోత్స్న, బీసీ సెల్ అధ్యక్షుడు సతీష్ కుమార్ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఎల్.రమణ
రిపబ్లిక్ డేను పురస్కరించుకుని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో తెతెదేపా అధ్యక్షుడు రమణ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రాల్లో రాజ్యాంగ బద్ధంగా పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు.
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఎల్.రమణ
రాష్ట్రాల్లో రాజ్యాంగ బద్ధంగా పాలన సాగాలని ఎల్.రమణ ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఎల్.రమణ... రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా పాలన సాగుతోందని విమర్శించారు.