రీజినల్ రింగ్ రోడ్డు డీపీఆర్ కన్సల్టెన్సీని నెల రోజుల్లో ఖరారు చేయనున్నట్లు ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు తెలిపారు. డీపీఆర్ కోసం 20 కన్సల్టెన్సీ సంస్థలు బిడ్‌లు దాఖలు చేసినట్లు సమాచారం. ఈ సంస్థల సాంకేతికతకు సంబంధించి మదింపు ప్రక్రియ కొనసాగుతోందని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఇందుకు కనీసం నెల రోజులు పట్టే అవకాశముందన్నారు.
NHAI : నెల రోజుల్లో రీజినల్ రింగ్ రోడ్డు డీపీఆర్ కన్సల్టెన్సీ ఖరారు
రీజినల్ రింగ్ రోడ్డు డీపీఆర్ కోసం 20 కన్సల్టెన్సీ సంస్థలు బిడ్ దాఖలు చేసినట్లు సమాచారం. మరో నెల రోజుల్లో డీపీఆర్ కన్సల్టెన్సీని ఖరారు చేయనున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు.
ఎన్‌హెచ్‌ఏఐ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, రీజినల్ రింగ్ రోడ్లు
రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి 182 కిలో మీటర్ల మేర డీపీఆర్ కోసం ఎన్‌హెచ్‌ఏఐ గత ఏప్రిల్‌లో టెండర్లు పిలిచింది. తొలి గడువుకు స్పందన రాకపోవడం వల్ల ఈ నెల 2 వరకు గడువును పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు.
- ఇదీ చదవండి :'బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా అసంపూర్ణమే'