ACCMC is Rejected : అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం రాజధాని ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. ఈనెల 5నుంచి గ్రామాల వారీగా సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది. మంగళగిరి మండలంలో 3 గ్రామాలు, తుళ్లూరు మండలంలో ని 16 గ్రామాల్లో అభిప్రాయ సేకరణ జరిగింది. అన్నిచోట్ల ప్రభుత్వ నిర్ణయాన్ని గ్రామస్థులు వ్యతిరేకించారు. అమరావతిని విడగొడితే సహించేది లేదని స్పష్టం చేశారు. 29 గ్రామాలతో కూడిన సీఆర్డీఏను ఎట్టిపరిస్థితిల్లోనూ విచ్ఛిన్నం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.
Amaravati Capital City Municipal Corporation: రెండున్నరేళ్లలో రాజధాని ప్రాంతంలో ఒక్క ఇటుక కూడా పెట్టని ప్రభుత్వం.. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వెనక కారణాలేంటని ప్రజలు నిలదీశారు. రాజధాని భూములు తాకట్టు పెట్టడం కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.