లోన్‌యాప్‌లపై నమోదైన కేసుల అంశంలో స్పందించిన ఆర్‌బీఐ - telangana news
15:35 December 23
లోన్‌యాప్‌లపై నమోదైన కేసుల అంశంలో స్పందించిన ఆర్‌బీఐ
రుణ యాప్‌లపై నమోదైన కేసుల అంశంపై ఆర్‌బీఐ స్పందించింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీకి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన యాప్స్ అధిక వడ్డీలు, ఇతర రుసుముల తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది.
సులభంగా రుణాలు ఇస్తున్న వారి మాయలో పడొద్దని పేర్కొంది. వ్యక్తిగత వివరాలు, డాక్యుమెంట్లు ఎవరికీ ఇవ్వొద్దని స్పష్టం చేసింది. ఇటువంటి మోసాలపై sachet.rbi.org.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది.
ఇదీ చదవండి :కదులుతున్న డొంక... లోన్యాప్లో చైనీయుల హస్తం