ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల ఆందోళనలు(AP Ration dealers protests) ఇవాళ కూడా కొనసాగనున్నాయి. జీవో నంబర్ 10 రద్దుతో పాటు తదితర సమస్యలను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు ఆందోళన చేస్తున్నారు. సీఎం జగన్ తమ సమస్యలపై స్పందించే వరకు నిరసనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.
ఉన్నతాధికారులతో చర్చలు..
రేషన్ డీలర్ల(AP Ration dealers protests)తో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ గిరిజాశంకర్తో జరిపిన చర్చలు కొలిక్కిరాలేదని.. ఇవాళ గిడ్డంగుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీలర్లు తెలిపారు.