తెలంగాణ

telangana

ETV Bharat / city

బసవతారకం ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స: బాలకృష్ణ

రొమ్ము క్యాన్సర్​తో బాధపడుతున్న మహిళకు అరుదైన చికిత్స చేసి కాపాడినట్లు బసవతారకం క్యాన్సర్​ ఆస్పత్రి ఛైర్మన్​ బాలకృష్ణ తెలిపారు. వరద సాయంపై సినీరంగ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.

balayya
బసవతారకం ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స: బాలకృష్ణ

By

Published : Oct 21, 2020, 5:44 AM IST

హైదరాబాద్​లోని బసవతారకం క్యాన్సర్​ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించినట్టు ఆస్పత్రి ఛైర్మన్​, సినీనటుడు బాలకృష్ణ తెలిపారు. శ్రీకాళహస్తికి చెందిన మహిళకు రొమ్ము క్యాన్సర్ శస్త చికిత్స చేసి కాపాడినట్లు పేర్కొన్నారు.

రొమ్ము కాన్సర్​తో బాధపడుతూ.. చివరి దశలో బసవతారకం ఆస్పత్రిలో చేరారని.. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు చెప్పినట్లు బాలయ్య తెలిపారు. ఆపరేషన్​ చేయాల్సిన సమయానికి సదరు మహిళ కరోనా బారిన పడ్డారన్నారు. కొవిడ్​ నుంచి కోలుతున్న తర్వాత శస్త్ర చికిత్స చేసినట్లు వివరించారు. పూర్తి ఉచితంగా వైద్యం అందించినట్లు బాలయ్య తెలిపారు.

వరద సాయంపై.. సినీరంగ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

బసవతారకం ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స: బాలకృష్ణ

ఇవీచూడండి:విరాళాల వెల్లువలు... ఆపదలో సినీ ప్రముఖుల ఆపన్నహస్తం

ABOUT THE AUTHOR

...view details