మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న కొండా బయోపిక్(konda movie launch news) షూటింగ్.. ఏపీలో జరగనుంది. మరో రెండు రోజుల్లో ఈ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు డైరెక్టర్ వర్మనే స్వయంగా తెలిపారు. షూటింగ్లో భాగంగా.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు వచ్చిన వర్మ.. కొండా సినిమా (konda movie shooting at west Godavari district) గురించి పలు విశేషాలు పంచుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సినిమాకు సంబంధించిన కొంత భాగం తీయనున్నట్లు చెప్పారు. 15 రోజుల పాటు వివిధ లొకేషన్లలో సినిమా షూటింగ్ ఉంటుందన్నారు. అటవీ ప్రాంతంలోనూ షూటింగ్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే హనుమకొండ జిల్లాలోని వంచనగిలో ప్రారంభమైన షూటింగ్.. వరగంల్ పరిసర ప్రాంతాల్లో సాగుతోంది. ఇప్పుడు కొండా ఏపీకి రానున్నాడు.
తెలంగాణలో జరిగిన రక్తచరిత్రగా..
వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma Latest News)... హారర్, ఫ్యాక్షనిజం, రౌడీయిజం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచిన మాట అటుంచితే.. ఈ కథాంశాలతోనే వర్మ మరింత పాపులర్ అయ్యారు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో సాగే 'రక్త చరిత్ర' సినిమా తీసిన ఆర్జీవీ ఇప్పుడు తెలంగాణలో జరిగిన రక్తచరిత్రపై "కొండా" పేరుతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి హనుమకొండలోని వంచనగరిలో కొండా బయోపిక్ షూటింగ్‌ను ప్రారంభించారు.