దేశప్రగతి కోసం రాజీవ్‌గాంధీ చేసిన త్యాగాలు ఎనలేనివంటూ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టకంటి ఆర్జీ వినోద్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా హిమాయత్‌నగర్ కూడలిలో వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం, మాస్కులు, శానిటైజర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల సేవా కార్యక్రమాలు - hyderabad latest news
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హిమాయత్‌నగర్ కూడలిలో వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం, మాస్కులు, శానిటైజర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
rajiv gandhi death anniversary programs in hyderabad
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు... రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలను కాంగ్రెస్ నాయకులు స్మరించుకున్నారు.