రైతు బంధు పథకం కింద అన్నదాతల ఖాతాల్లో రెండో రోజు డబ్బులు జమయ్యాయి. మంగళవారం 14,69,039 మంది రైతుల ఖాతాలకు రూ.1125.31 కోట్ల నగదును బదిలీ చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎకరం లోపు భూమి ఉన్న 16,03,938 రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ.494.10 కోట్లను వేసింది.
రెండో రోజు రైతు బంధు డబ్బులు బదిలీ - తెలంగాణ వార్తలు
యాసంగి కోసం రైతుబంధు సాయం పంపిణీ కొనసాగుతోంది. రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది.
రెండో రోజు రైతు బంధు డబ్బులు బదిలీ
దీంతో రెండు రోజుల్లో కలిపి 30,72,977 మంది రైతుల ఖాతాల్లో రూ.1619.42 కోట్ల నగదు జమ అయింది. సోమవారం ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాలకు డబ్బులు జమచేయగా, మంగళవారం రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు డబ్బులు బదిలీ చేశారు.
ఇదీ చూడండి: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం