పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని... సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమల్లోకి రావడం, రెండేళ్లు కొవిడ్ కారణంగా.. యువతీ యువకులకు వయో పరిమితిని పెంచాలని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్, డీజీపీని... సీఎం ఆదేశించారు.
పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితి పెంపు - telangana job notifications
13:56 May 20
అభ్యర్థుల వయోపరిమితి రెండేళ్లు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం
ఇవాళ్టితో పోలీస్ ఉద్యోగ దరఖాస్తుకు గడువు ముగియనుండగా... సీఎం నిర్ణయంతో గడువు పొడగించే అవకాశముంది. ఇప్పటికే 17వేల291 ఉద్యోగాలకుగానూ... దాదాపు 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గురువారం ఒక్కరోజే దాదాపు లక్ష దరఖాస్తులు వచ్చాయి. ఒకేసారి నగదు చెల్లింపులు జరుపుతుండటంతో సాంకేతికత సమస్యలు తలెత్తుతున్నాయి. చెల్లింపు విఫలమైనట్లు సందేశం వస్తున్నా.. నగదు మాత్రం ఖాతాలో నుంచి డెబిట్ అవుతోందని అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. నగదు సఫలీకృతమైతేనే దరఖాస్తు ప్రక్రియ పూర్తవతుందని పోలీసు నియామక మండలి అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఖాతాలో నగదు డెబిట్ అయినా వారం రోజుల వ్యవధిలో తిరిగి జమ అవుతోందని అధికారులు తెలిపారు.
శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 10లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస రావు తెలిపారు. 5.6 లక్షల మంది అభ్యర్థులు వివిధ విభాగాల వారీగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసినట్లు ఆయన చెప్పారు. ఆరు నోటిఫికేషన్ల ద్వారా పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖ, ప్రత్యేక భద్రతా దళం, రవాణా, ఆబ్కారీ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 15,644 కానిస్టేబుల్ పోస్టులు, 554 ఎస్సై పోస్టులు, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్, 383 కమ్యూనికేషన్ కానిస్టేబుల్, 63 రవాణా కానిస్టేబుల్, 33 వేలిముద్రల ఏఎస్సై పోస్టులు భర్తీ చేయనున్నారు. వచ్చే మార్చి నాటికి ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసు నియామక మండలి అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: