Monsoon in Telangana 2022 : నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన రెండ్రోజుల్లోనే పలు ప్రాంతాల్లో కంభవృష్టి కురుస్తోంది. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ అత్యధికంగా రంగారెడ్డి జిల్లా సంగం గ్రామంలో 15.9 సెం.మీ., ఉడిత్యాల(మహబూబ్‌నగర్)లో 15.6, తోటపల్లి(నాగర్‌కర్నూల్)లో 13.6, కందుకూరులో 13.1, ఆమన్‌గల్‌లో 12.6, వనపర్తిలో 12.5 మీర్కాన్‌పేటలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం పగలు కూడా పలు ప్రాంతాల్లో 6 సెం.మీ.ల వరకూ వర్షపాతం నమోదైంది.
Monsoon in Telangana 2022 : 'నైరుతి' షురూలోనే దంచికొట్టిన వాన
Monsoon in Telangana 2022 :నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన రెండ్రోజుల్లోనే పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షానికి హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. తెల్లవారుజాము నుంచి వాన కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
Telangana Rain Today : రుతుపవనాలు హైదరాబాద్, మెదక్ సహా మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణశాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో తెలంగాణ అంతటా విస్తరిస్తాయని వివరించింది. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉత్తర-దక్షిణ ఉపరితలద్రోణి ఏర్పడింది. దీంతో రెండ్రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రంలో నిన్న కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా భాగ్యనగర వాసులకు ప్రతి ఏటా మాదిరి తిప్పలు తప్పలేదు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై.. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. రహదారులపైకి వరద రావడంతో చెరువును తలపించాయి. ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వాళ్లంతా చాలా ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకునేటప్పుడూ ఇదే పరిస్థితి.