Rain In Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం - హైదరాబాద్‌లో వర్షం
11:05 August 06
Rain In Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం వర్షం కురిసింది. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, నాంపల్లి, హైదర్ గూడ, నారాయణ గూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ, బషీర్ బాగ్, లక్డీకపుల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. వర్షంతో కార్యాలయాలకు వెళ్లేవాళ్లు ఇబ్బంది బడ్డారు. వాహనదారులు, బాటసారులు వర్షంలోనే తడుచుకుంటూ వారి వారి కార్యాలయాలకు చేరుకుంటున్నారు.
తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (RAINS) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HYDERABAD WEATHER CENTER) ప్రకటించింది. ఈరోజు రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీని ఫలితంగా నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:TS weather Report: రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు