రాష్ట్రంలో కొన్నిచోట్ల రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే (Rains in Telangana) అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) వెల్లడించింది.
కింది స్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి ఇవాళ రాష్ట్రం వైపునకు వస్తున్నాయని వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Center) సంచాలకులు తెలిపారు. ఈ నెల 6నుంచి వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలున్నాయని సంచాలకులు వివరించారు.
ఇటీవల గులాబ్ తుపాను ప్రభావం
గులాబ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా 43,870 చెరువులుండగా.. వాటిలో 21,552 పూర్తిగా నిండిపోయి అలుగు పోస్తున్నాయి. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పెద్దచెరువు పుష్కరకాలం తర్వాత నిండింది. పలు చెరువులకు గండి కొట్టాల్సి వచ్చింది. అనేక ఇళ్లు నేలకూలాయి. కొన్నిచోట్ల చెక్‌డ్యాంలు, వైకుంఠధామాలు వరదకు కొట్టుకుపోయాయి. సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ బయటకు ట్రాక్టర్‌లో రావాల్సి వచ్చింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల వరద ఉద్ధృతి కారణంగా నష్టం వాటిల్లగా.. మరికొన్నిచోట్ల నాసిరకం పనుల కారణంగా దెబ్బతిన్నాయి.
ఇవీ చూడండి: