ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కొవిడ్ ఉద్ధృతి సమయంలో పెంచిన రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసింది. కరోనా వేళ రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు టికెట్ ధరను రూ.50గా చేసింది. తాజాగా అన్ రిజర్వ్డ్.. ఎక్స్ప్రెస్, సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్లాట్ఫామ్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది.
TICKET FARE: ప్లాట్ఫామ్ టికెట్ ధరలు తగ్గించిన రైల్వే - telangana latest news
రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధరలు తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకొంది. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా మిగిలిన స్టేషన్లలో టికెట్ ధరను రూ.10 చేసింది.
railway Platform Ticket Fare reduced
సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ.10, సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో మాత్రం రూ.20 ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. నేరుగా కౌంటర్ వద్ద లేదా యూటీఎస్ యాప్, క్యూఆర్ స్కాన్ ద్వారా ఫ్లాట్ఫామ్ టికెట్లను తీసుకోవచ్చని తెలిపింది. కొవిడ్ మార్గదర్శకాలతో పాటు ప్రయాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి సీహెచ్ రాకేశ్ కోరారు.