తెలంగాణ

telangana

ETV Bharat / city

కేఎంసీలో మరోసారి ర్యాగింగ్​ కలకలం! - KMC

కేఎంసీలో మరోసారి ర్యాగింగ్​ కలకలం!
కేఎంసీలో మరోసారి ర్యాగింగ్​ కలకలం!

By

Published : Nov 15, 2021, 1:44 PM IST

13:37 November 15

కేఎంసీలో మరోసారి ర్యాగింగ్​ కలకలం!

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ)లో మరోసారి ర్యాగింగ్‌ కలకలం రేగింది. సీనియర్‌ విద్యార్థులు మద్యం మత్తులో ఫ్రెషర్స్‌డే పేరుతో జూనియర్లను ర్యాగింగ్‌ చేస్తున్నారంటూ ఓ విద్యార్థి.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మంత్రి కేటీఆర్‌, డీజీపీ, రాష్ట్ర వైద్యసంచాలకులను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. 2017 బ్యాచ్‌కు చెందిన సుమారు 50 మంది సీనియర్లు మద్యం తాగి తమను వేధిస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌దాసును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా అలాంటిదేమీ లేదన్నారు. జూనియర్‌ విద్యార్థుల హాస్టల్‌కు సీనియర్ల హాస్టల్‌ భవనాలు దూరంగా ఉంటాయని తెలిపారు. సీనియర్లు కొందరు జన్మదిన వేడుకలు చేసుకున్నారని.. ఆ సందర్భాన్ని గిట్టనివారు ఇలా చిత్రీకరిస్తున్నారన్నారు. ఘటనపై డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఆరా తీశారు. సోమవారం కేఎంసీలో జరగాల్సిన ఫ్రెషర్స్‌డేకు అనుమతి ఇవ్వొద్దని ఆయన సూచించినట్లు సమాచారం. ట్విటర్‌లో వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసు కమిషనర్‌ ఆదేశాలతో మట్టెవాడ స్టేషన్‌ పోలీసులు ఆదివారం కేఎంసీలో విచారణ జరిపారు. ర్యాగింగ్‌పై తమకు విద్యార్థులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని సీఐ గణేశ్‌ తెలిపారు. రెండు నెలల క్రితం ఉత్తరాదికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను కళాశాలలో ర్యాగింగ్‌ చేయడం అప్పట్లో కలకలం రేపిన విషయం విదితమే.

ఇదీ చూడండి: చీటింగ్​ కేసుపై స్పందించిన నటి శిల్పాశెట్టి

ABOUT THE AUTHOR

...view details