తెలంగాణ

telangana

ETV Bharat / city

క్షయనివారణ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి: ఆర్​.కృష్ణయ్య - TB EMPLOYEES DEMANDS

జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో పనిచేస్తున్న ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య డిమాండ్​ చేశారు. ఉద్యోగులు చేస్తున్న మహాధర్నాకు ఆయన మద్దతు తెలిపారు.

క్షయనివారణ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి: ఆర్​.కృష్ణయ్య

By

Published : Jul 30, 2019, 6:21 PM IST

జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని వైద్య విద్యా సంచాలకుని కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాధర్నాలో కృష్ణయ్య పాల్గొన్నారు. తెలంగాణలో సవరించిన జాతీయ క్షయ నివారణ కార్యక్రమాన్ని 1996లో ప్రారంభించారని తెలిపారు. అప్పటి నుంచి 22 ఏళ్లుగా.. 547 మంది సేవలందిస్తున్నారని కృష్ణయ్య తెలిపారు.

ఉద్యోగులకు పీఎఫ్​, ఈఎస్​ఐ, కనీస వేతనం అమలు చేయకుండా పని చేయించుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

క్షయనివారణ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి: ఆర్​.కృష్ణయ్య

ఇవీ చూడండి: ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: జీవన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details