రాజ్యంగ విరుద్ధంగా తొలగించిన 26 కులాలను వెంటనే బీసీ జాబితాలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో... తొలగించబడిన 26 కులాల నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. బీసీ జాబితా నుంచి కులాలను తొలగించటాన్ని నిరసిస్తూ... ఈ నెల 27న నాంపల్లిలోని ఫ్యాప్సి భవన్లో తలపెట్టిన ఆత్మగౌరవ సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
'వైఖరి మార్చుకోకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తాం' - 'సర్కారు తన వైఖరి మార్చుకోకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తాం'
హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో... తొలగించబడిన 26 కులాల నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ నెల 27న నాంపల్లిలోని ఫ్యాప్సి భవన్లో తలపెట్టిన ఆత్మగౌరవ సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో 48 ఏళ్లుగా బీసీలలో కొనసాగిన 26 కులాలను ఎలా తొలగిస్తారని కృష్ణయ్య ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ... ముఖ్యమంత్రికి కానీ... బీసీ జాబితా నుంచి కులాలను తొలగించడం, కలిపే అధికారం లేదన్నారు. జాతీయ బీసీ కమిషన్ సిఫార్సులతో మాత్రమే నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. తెరాస పార్టీ అధికారంలోకి రాగానే బీసీల పట్ల కక్షపురితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తొలగించిన కులాల గురించి జాతీయ బీసీ కమిషన్ ప్రశ్నించినా... రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల తన వైఖరిని మార్చుకొని... తొలగించిన కులాలను బీసీ జాబితాలో చేర్చకపోతే వేలాది మందితో ప్రగతి ముట్టడిస్తామని హెచ్చరించారు.