గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో... జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా వైకాపా నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని తెదేపా నేతలు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్నికల సిబ్బంది వద్ద ఉన్న జడ్పీటీసీ బ్యాలెట్ పత్రాల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఉందని తెదేపా నేతలు ఆరోపించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా రిగ్గింగ్‌కు పాల్పడిందంటూ తెదేపా నేతల ఆందోళన - quarreling in guntur district
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల వైకాపా, తెదేపా నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. ఉయ్యందనలో అధికార పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ తెదేపా నేతలు ఆందోళన చేశారు. గారపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
గుంటూరులో ఉద్రిక్తత
మరోవైపు గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడులో వైకాపా, తెదేపా నేతలు రెండు వర్గాలుగా ఏర్పడి ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఇవీచూడండి:తెరాసకే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం... కాంగ్రెస్ అభ్యంతరం