అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి
13:36 December 20
అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి
తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం 5 రాష్ట్రాలు అదనపు రుణాలు పొందేందుకు అనుమతులిచ్చింది కేంద్ర ఆర్థికశాఖ. ఫలితంగా ఆయా రాష్ట్రాలు రూ. 16,728కోట్లు అదనంగా పొందనున్నాయి. సులభతర వాణిజ్య సంస్కరణలను అమలు చేసినందుకు ఈ వెసులుబాటు కల్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలు అదనంగా రూ.16,728 కోట్ల రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అంగీకరించింది. నిర్దేశించిన సులభతర వాణిజ్య సంస్కరణలను పూర్తి చేసిన కారణంగా ఆయా రాష్ట్రాలు ఈ వెసులుబాటును కల్పించింది. అదనపు రుణాలను పొందేందుకు సులభతర వాణిజ్యంలో తాము తీసుకొచ్చిన సంస్కరణలను అమలు చేయాలని ఈ ఏడాది మే నెలలో సూచించింది ఆర్థికశాఖ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ అదనపు రుణాలు పొందేందుకు అర్హత సాధించాయి.
ఫలితంగా రూ.2,508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి అనుమతి లభించింది. రూ.2,525 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు ఏపీకి వెసులుబాటు కల్పించింది.