తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉక్కు ఉద్యమం.. దేశవ్యాప్త కార్మిక సంఘాల మద్దతుకు యత్నాలు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఉక్కు ఉద్యమం మరింత ఉద్ధృతం చేసే దిశగా కార్మిక సంఘాలు కార్యచరణ రూపొందిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా మద్దతు కూడగడుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వమూ దూకుడు పెంచాలని అభిప్రాయపడుతున్నాయి. నిరవధిక సమ్మెకు నేడు నోటీసు ఇవ్వాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది.

protest-against-the-privatizations-of-visakhapatnam-steel
ఉక్కు ఉద్యమం.. దేశవ్యాప్త కార్మిక సంఘాల మద్దతుకు యత్నాలు

By

Published : Mar 11, 2021, 12:49 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనల హోరు కొనసాగించే దిశగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల మద్దతు కూడగడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటీకరణ నిర్ణయాల నుంచి కాపాడేలా విశాఖ ఉక్కు ఉద్యమం తొలి అడుగు కావాలని పిలుపునిస్తున్నారు. ఇవాళ నిరవధిక సమ్మెకు నోటీసు ఇవ్వాలని పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది.

దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల్లో ధర్నాలు, ఆందోళనలకూ కార్మిక నేతలు పిలుపునిచ్చారు. ఈనెల 20న పెద్ద ఎత్తున కార్మిక గర్జన నిర్వహించాలని నిర్ణయించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సహా.. నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమించాలని కమిటీ భావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచాలి..
కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచాలని కార్మిక నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి లేఖకు ప్రధాని మోదీ నుంచి ఆశించిన స్పందన రాకుంటే మరింత ఉద్ధృతంగా నిరసనలు చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ వైఖరిపై కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు మండిపడుతున్నారు. పరిశ్రమలో ఉక్కు ఉత్పత్తిపై ప్రభావం పడకుండా ఉద్యమం నడపించాలనే అంశంపై కార్మిక నేతలు ప్రత్యేక చర్చలు జరుపుతున్నారు.

ఇదీచూడండి:టీఎంసీ మేనిఫెస్టో విడుదల వాయిదా.. కారణమిదే..

ABOUT THE AUTHOR

...view details