తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2019, 11:14 AM IST

ETV Bharat / city

బైక్ అంబులెన్స్​ వైద్యుడి సహాయంతో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

విశాఖ మన్యం అంటనే వసతులలేమి... ప్రాణం మీదకొస్తే ఎవరైనా భుజాలమీద వేసుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి.. అలాంటి ప్రాంతంలో ఓ గర్భిణికి అర్థరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. అంబులెన్స్ వెళ్లే మార్గం లేదు. నొప్పులు ఎక్కువ అయ్యాయి. ఆ సమయంలోనే బైక్ ఫీడర్ అంబులెన్స్ ఆ తల్లి ప్రాణాన్ని కాపాడింది. పండకి బిడ్డకు ఊపిరిలూదింది.

pregnant-women-give-birth-in-bike-ambulance
బైక్ అంబులెన్స్​ వైద్యుడి సహాయంతో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

విశాఖ మన్యంలో బైక్ ఫీడర్ అంబులెన్స్​లో తరలిస్తుండగా ఓ గర్భిణి ప్రసవించింది. జి. మాడుగుల మండలం బీరం పంచాయతీ తర్మరంగి కొండల్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్​పై 2 కిలోమీటర్లు మోసుకొచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ అయ్యాయి. బైక్ అంబులెన్స్ వైద్య నిపుణుడి సహాయంతో గర్భిణికి చికిత్స చేయగా.. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

బైక్ అంబులెన్స్​ వైద్యుడి సహాయంతో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

ABOUT THE AUTHOR

...view details