పోలీసులపై కోపం తెచ్చుకున్న ఓ విద్యుత్ కార్మికుడు రెండు ఠాణాల్లో కరెంటు తీసేశాడు. మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్లో జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో బన్నీ(17) పట్టుబడ్డాడు. జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తోన్న తన తండ్రి రమేశ్‌కు ఫోన్ చేసి తనను పట్టుకున్నారని చెప్పాడు.
పోలీసులపై కోపంతో రెండు ఠాణాల్లో కరెంట్ కట్ - jeedimetla latest news
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని రెండు పోలీస్స్టేషన్లలో రెండున్నర గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం కలిగింది. అదేదో సాంకేతిక సమస్యో... మరమ్మతుల కారణంగానో కాదు. పోలీసులపై విద్యుత్ ఔట్సోర్సింగ్ కార్మికుడికి వచ్చిన కోపం వల్ల..! అసలు అతడికి కోపం ఎందుకు వచ్చిందో చూడండి.
సదరు ట్రాఫిక్ ఎస్సైతో రమేశ్ మాట్లాడగా.. విడిచి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. పోలీసులపై కోపం తెచ్చుకున్న రమేశ్... జీడిమెట్ల పీఎస్, జీడిమెట్ల ట్రాఫిక్ పీఎస్‌లో కరెంటు కట్ చేశాడు. సుమారు రెండున్నర గంటల పాటు పీఎస్‌లు అంధకారంలోనే ఉన్నాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటం వల్ల విద్యుత్‌ను పునరుద్ధరించాడు.
ఈ ఘటనపై విద్యుత్ డీఈని వివరణ కోరగా... కరెంటు తీసేసిన మాట వాస్తవమే అని తెలిపారు. దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.