సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2)నూ పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. లేపాక్షి ఛార్జ్‌షీట్‌లో బీపీ ఆచార్యపై పీసీ చట్టం సెక్షన్లు నమోదు చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో.. బీపీ ఆచార్య సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కొత్త సెక్షన్లపై హైకోర్టుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని ఆచార్య న్యాయస్థానాన్ని కోరగా.. సీబీఐ కోర్టు ఈ కేసును ఈ నెల 26కు వాయిదా వేసింది.
సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ - సీఎం జగన్ వార్తలు
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై నేడు సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసును కోర్టు ఈ నెల 26కు వాయిదా వేయగా.. రఘురాం సిమెంట్స్ కేసు ఈ నెల 22కు వాయిదా పడింది. దాల్మియా కేసు ఏప్రిల్ 9కి, ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 30కి వాయిదా పడ్డాయి.
సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
ఇండియా సిమెంట్స్, ఇందూ టెక్‌జోన్ కేసు, అరబిందో, హెటిరో, గృహనిర్మాణ ప్రాజెక్టుల కేసులు ఈ నెల 26కి వాయిదా పడగా.. రఘురాం సిమెంట్స్ కేసు ఈ నెల 22, దాల్మియా కేసు ఏప్రిల్ 9, ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 30కి వాయిదా పడ్డాయి.
ఇదీ చదవండి:రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ తెరాసదే విజయం: తలసాని