భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. లక్ష్మణ్ కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఆగస్టు 13న హైదరాబాద్‌లో భాజపా వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. తెరాస, భాజపా రెండు పార్టీలు తోడు దొంగలేనని దుయ్యబట్టారు. ప్రత్యేక విమానంలో వెళ్లిన తెరాస రాజ్యసభ సభ్యుడు సంతోష్‌రావు బిల్లులకు మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. భాజపాకు ఎక్కడా 3వేల ఓట్లు రాలేదని... అడ్డిమారి గుడ్డి దెబ్బతో ఎంపీ స్థానాలు గెలిచారని ఎద్దేవా చేశారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ గురించి చెబుతూ కమలం పార్టీ పబ్బం గడుపుతోందని విమర్శించారు. తెరాస ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ ఆర్టీసీ సంస్థను చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు.
తెరాస, భాజపా పార్టీలు తోడు దొంగలే: పొన్నం ప్రభాకర్ - తెరాస, భాజపా పార్టీలు తోడు దొంగలే: పొన్నం ప్రభాకర్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం పరిరక్షించాలని కోరారు.
తెరాస, భాజపా పార్టీలు తోడు దొంగలే: పొన్నం ప్రభాకర్