ఏపీ పుర పోలింగ్ : ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం ఇలా..! - ap municipal elections polling updates
ఏపీలో పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవాడనికి ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. 9 గంటలు దాటే సమయానికి సుమారు 12 శాతంగా నమోదైంది.
ఉదయం 9 గంటలకు ఏపీ పుర పోలింగ్ శాతం ఇలా..!
ఏపీలో పుర ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. ఉదయం నుంచే పెద్దఎత్తున ఓటర్లు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం తొమ్మిద గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 శాతం పోలింగ్ నమోంది.
జిల్లా | పోలింగ్ శాతం |
శ్రీకాకుళం | 10 |
విజయనగరం | 14 |
విశాఖ | 14 |
తూర్పుగోదావరి | 16 |
పశ్చిమగోదావరి | 16 |
కృష్ణా | 13 |
గుంటూరు | 16 |
ప్రకాశం | 14 |
నెల్లూరు | 12 |
చిత్తూరు | 9 |
అనంతపురం | 12 |
కడప | 8 |
కర్నూలు | 11 |