అమరావతిలోని వెలగపూడిలో పోలీసుల అరెస్టులు, తనిఖీలతో రైతు కుటుంబాల మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాజధాని ఘటనల్లో నిందితుల కోసమంటూ పోలీసులు ఇళ్లల్లోకి రాగా... వారెంట్ ఏదంటూ పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. పెద్దసంఖ్యలో ఇళ్లల్లోకి ప్రవేశించిన పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేసి పలువురిని తమతో పాటు తీసుకెళ్లారు.
వెలగపూడిలో కలకలం... రైతుల ఇళ్లల్లోకి పోలీసులు! - వెలగపూడిలో అరెస్టులు
'పోలీసులకు లాఠీలు బదులు గన్లు ఇచ్చి పంపించండి. కనిపించిన వాళ్లందరిని కాల్చివేయండి. శ్మశానం మీద ఏలుకోండి' ఇది వెలగపూడిలోని ఓ మహిళ ఆవేదన. వెలగపూడిలో పోలీసుల అరెస్టులు, తనిఖీలతో రైతు కుటుంబాల మహిళలు వణికిపోయారు. రోజూ హింసించే బదులు ఒకేసారి చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
amarawathi
వైకాపాకు ఓట్లేసి నెత్తిన కుంపటి పెట్టుకున్నామంటూ పలువురు మహిళలు ఉద్వేగానికి గురయ్యారు. హింసించే బదులు తమని ఒకేసారి చంపేస్తే ఆందోళనలు ఉండవని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చూడండి:కులం చెబితే కేసులు ఉండవా!