తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజాసింగ్‌ రిమాండ్‌పై హైకోర్టును ఆశ్రయించిన పోలీసులు - రాజాసింగ్‌ రిమాండ్‌పై హైకోర్టుకు వెళ్లిన పోలీసులు

హైకోర్టు
హైకోర్టు

By

Published : Aug 25, 2022, 2:13 PM IST

Updated : Aug 25, 2022, 2:44 PM IST

14:11 August 25

పోలీసుల రిమాండ్‌ పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనున్న హైకోర్టు

రాజాసింగ్‌ రిమాండ్‌పై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు రిమాండ్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం రేపు విచారణ చేపట్టనుంది.

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం షాహినాయత్ గంజ్, మంగళ్‌హట్ పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న రాజా సింగ్‌పై నమోదైన కేసుల్లో ఈ నోటీసులు జారీ అయ్యాయి. పోలీసులు నోటీసులు ఇవ్వడంపై రాజా సింగ్‌ స్పందించారు. పాత కేసుల్లో తనను మరోసారి అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నిన్ననే నోటీసులు సిద్ధం చేసి ఈ ఉదయం అందించారని చెప్పారు. కేసులు నమోదైన ఆర్నెళ్ల నుంచి పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాజా సింగ్‌పై కేసు నమోదైంది. అసిస్టెంట్ చీఫ్ ఎలక్టోరల్‌ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 19న మంగళ్‌హట్ పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో రెచ్చగొట్టేలా పాట పాడారని షాహినాయత్ గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఏప్రిల్ 12వ తేదీన మరో కేసు నమోదైంది. ఎస్సై రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ రాజా సింగ్‌కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ కావడం గమనార్హం.

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాజా సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రాజా సింగ్‌ను నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే, 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో పోలీసుల అరెస్టు విధానం సరిగా లేదంటూ ఆయనను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా నోటీసులిచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 25, 2022, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details