తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడు రాష్ట్ర బంద్.. ముందస్తు వ్యూహరచనలో పోలీసులు

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రేపు అన్ని రాజకీయ, ప్రజా సంఘాలు ఐక్యంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రజారవాణా వ్యవస్థను ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు రాష్ట్ర బంద్‌కు దిగాయి. ఈ బంద్‌ పిలుపునకు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించి శనివారం బంద్‌లో పాల్గొంటున్నట్టు తెలిపాయి.

రేపు రాష్ట్ర బంద్.. ముందస్తు వ్యూహరచనలో పోలీసులు

By

Published : Oct 18, 2019, 8:43 PM IST

Updated : Oct 19, 2019, 5:31 AM IST

రేపు రాష్ట్ర బంద్.. ముందస్తు వ్యూహరచనలో పోలీసులు
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేపట్టి నేటికి రెండు వారాలు పూర్తయింది. ఆందోళనలు, ర్యాలీలు, వంటా వార్పు, మానవహారాలతో తమ నిరసన తెలిపిన కార్మిక సంఘాలు శనివారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌ను విజయవంతం చెయ్యాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు శుక్రవారం ద్విచక్ర వాహాన ర్యాలీలు నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కొన్ని రెవెన్యూ సంఘాలతో పాటు ఓలా, ఊబర్‌ క్యాబ్స్‌ కూడా తమ మద్దతు ప్రకటించాయి.
పోలీసుల ముందు జాగ్రత్త చర్యలు
బంద్‌ను విజయవంతం చేయాలని ఐకాస నేతలు వ్యూహాలు రచించారు.

మరోవైపు సాధారణ జనజీవనానికి ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అన్ని ఆర్టీసీ డిపోలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే పోలీసులను మోహరించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేసే అవకాశముంది.

ఉదయం నుంచే నిరసనలు, ధర్నాలు

బంద్‌లో భాగంగా ఇవాళ యంజీబీఎస్‌ బస్‌ స్టేషన్‌ ముందు వామపక్షాలు ఉదయం 7 గంటలకు నిరసన కార్యక్రమం చేపట్టనున్నాయి. 11 గంటలకు ఆర్టీసీ క్రాస్​రోడ్స్‌ నుంచి భారీ ప్రదర్శన తలపెట్టనున్నాయి. జేబీఎస్‌తో పాటు ప్రధాన కూడళ్ల వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహాకరించాలని ఆచార్య కోదండరాం కోరారు.

అటు భాజపా, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు బంద్​కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్​లో పాల్గొని.. విజయవంతం చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు.

Last Updated : Oct 19, 2019, 5:31 AM IST

ABOUT THE AUTHOR

...view details