పరిసరాల పరిశుభ్రత కోసం ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మక్తాల ఫౌండేషన్ చైర్మన్ సురేందర్ గౌడ్ స్పష్టం చేశారు.మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాంగోపాల్‌పేట డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్ల, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం మరింతగా దెబ్బతిని మానవాళికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు.
'ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి' - plastic awareness
గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మక్తాల ఫౌండేషన్ వారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.
'ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి'