తెలంగాణ

telangana

ETV Bharat / city

గొర్రెల పెంపకం పథకంపై హైకోర్టులో వ్యాజ్యం

అనేక కుల వృత్తుల్లో భాగంగా గొర్రెల పెంపకం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రజాధనం దుర్వినియోగం చేశారని 'వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్' అనే సంస్థ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

By

Published : Jul 19, 2019, 8:09 PM IST

గొర్రెల పెంపకం పథకంపై హైకోర్టులో వ్యాజ్యం

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గొర్రెల పంపిణీ పథకంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 'వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్' అనే సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది.

గొర్రెల పెంపకం పథకంపై హైకోర్టులో వ్యాజ్యం

అవినీతి, అక్రమాల వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహాకార సమాఖ్య ఎండీ, ది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్​తో పాటు సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చూడండి : మహంకాళి జాతరకు పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details