తెలంగాణ

telangana

ETV Bharat / city

టోల్​గేట్​ రుసుం రద్దు చేయాలని హైకోర్టులో వ్యాజ్యం

టోల్‌గేట్‌ రుసుం రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సామాన్యుల వద్ద వసూలు చేసి ప్రజాప్రతినిధులకు మినహాయింపునిస్తున్నారని పిటిషనర్​ తెలిపారు. ఎవరెవరికీ మినహాయింపు ఇస్తున్నారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.

pil on tollgate

By

Published : Jul 26, 2019, 8:00 PM IST

టోల్​గేట్​ రుసుం రద్దు చేయాలని హైకోర్టులో వ్యాజ్యం

టోల్ గేట్ రుసుము రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది డి.విద్యా సాగర్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. టోల్ గేట్ రుసుము లేకపోతే.. రహదారుల నిర్వహణ ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. టోల్ గేట్ రుసుములోనూ వివక్ష చూపుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ వాదించారు. సామాన్యుల నుంచి వసూలు చేస్తూ.. ప్రజా ప్రతినిధులకు మినహాయింపునిస్తున్నారని తెలిపారు. ఎవరెవరికి మినహాయింపులు ఇస్తున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని పిటిషనర్​ను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details