రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో నిత్యవసర సరుకుల పంపిణీ జరుగుతోంది. ప్రజలు బారులు తీరి సామాజిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకెళ్తున్నారు. కానీ హైదరాబాద్ నగర శివారులోని బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్‌లో రేషన్ దుకాణానికి వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. రేషన్ దుకాణాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులను కోరారు.
ఆ రేషన్ దుకాణానికి వెళ్లేందుకు జనం భయం.! - హైదరాబాద్‌లో కరోనా ప్రభావం
హైదరాబాద్ నగర శివారు బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్‌లో రేషన్ దుకాణానికి వెళ్లేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రేషన్ దుకాణాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన అధికారులు శాంతినగర్‌లోని సామాజిక భవనంలోకి దుకాణాన్ని తరలించారు.
ఆ రేషన్ దుకాణానికి వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు..!
శాంతినగర్ కాలనీలోని రేషన్ దుకాణం యజమాని కొన్ని రోజుల క్రితం విదేశాలకు వెళ్లి వచ్చారు. గుర్తించిన పురపాలక సిబ్బంది సర్వే నిర్వహించి.. వారిని గృహ నిర్బంధం చేసి ఇంటికి మీపంస్టిక్కర్ అతికించారు. అసలే కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో వారి ఇంటి నుంచి సరుకులు తీసుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు అక్కడకు సమీపంలోని సామాజిక భవనంలోకి తరలించారు.