తెలంగాణ

telangana

ETV Bharat / city

అంచనాలు చూపారే తప్ప... ఆచరణ ప్రణాళికలు లేవు:పవన్ - ఏపీ బడ్జెట్ హైలెట్స్

ఆంధ్రప్రదేశ్​లో వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో అంచనాలు భారీగా ఉన్నాయి తప్ప...ఆచరణ ప్రణాళికలు లేవని పవన్ కల్యాణ్ ఆక్షేపించారు. కీలకమైన రంగాలకు బడ్జెట్​లో కోతలు విధించారని అన్నారు.

pavan
అంచనాలు చూపారే తప్ప... ఆచరణ ప్రణాళికలు లేవు:పవన్

By

Published : Jun 16, 2020, 9:06 PM IST

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక పద్దు(2020-21)పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా బడ్జెట్‌ తెచ్చారని అన్నారు. అంచనాలు భారీగా చూపారే తప్ప.. ఆచరణ ప్రణాళికలు లేవని దుయ్యబట్టారు. అభివృద్ధి లేని సంక్షేమం నీటి బుడగలాంటిదని వ్యాఖ్యానించారు. కీలకమైన రంగాలకు బడ్జెట్‌లో కోతలు విధించారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details