తెలంగాణ

telangana

ETV Bharat / city

యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి: పవన్​ కల్యాణ్​ - pawan kalyan tweet

ఏపీలో యూరేనియం తవ్వకాలపై వైకాపా ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని జనసేన అధినేత డిమాండ్​ చేశారు. కర్నూలు, నల్లమల ప్రాంతాల్లో యురేనియం తవ్వకాల విషయమై ఆయన ట్విట్టర్​ ద్వారా స్పందించారు.

యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి

By

Published : Sep 29, 2019, 6:11 PM IST

ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్​లో స్పందించారు. ‘ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలపై ప్రజలకు ఏపీ ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్​ చేశారు. తవ్వకాల గురించి ప్రభుత్వానికేమీ తెలియదని ఎలా అంటారని ప్రశ్నించారు. కనీసం కలెక్టర్లకు కూడా తెలియకుండా తవ్వకాలు జరగడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. ‘నల్లమల ప్రాంతంలో ఉండే ప్రజలకు మేం హామీ ఇస్తున్నాం. మీకు మద్దతుగా ఉంటాం. మీ పోరాటంలో భాగస్వాములమవుతాం' అని ట్వీట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details