ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద విధులెలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ప్రజలు పండుగలు కూడా చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటున్నారని.. అలాంటిది మద్యం దుకాణాలు తెరిచి లాక్డౌన్ స్ఫూర్తి మంటగలిపారని పవన్ విమర్శించారు.
వైకాపా సర్కారు 'కరోనా ఫ్రెండ్లీ': పవన్ - pavan kalyan comments on ycp
ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడంపై ఆయన ట్వీట్ చేస్తూ.. ఏపీలోని వైకాపా సర్కార్ ‘కరోనా ఫ్రెండ్లీ’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
వైకాపా సర్కారు 'కరోనా ఫ్రెండ్లీ': పవన్
అధికార పార్టీ సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో అధికారంలోకి వచ్చిందని... కరోనా విపత్తు ఉంటే మద్యం అమ్మకాలు ఆపలేరా అని పవన్ ప్రశ్నించారు. ఏపీ ' కరోనా ఫ్రెండ్లీ స్టేట్ ' అని జాతీయస్థాయిలో నవ్వుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు. చిరుద్యోగులు, చిరువ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు.
ఇవీ చదవండి...వైకాపా ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు