ఇటీవల కురిసిన భారీగా వర్షాలకు హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. వీధులన్నీ చెరువులను తలపించాయి. ఈ నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ కూడా పీజీ పరీక్షలతో పాటు పలు పరీక్షలను వాయిదా వేసింది. దసరా తరువాత పరీక్షల రీషెడ్యూల్ ప్రకటిస్తామని ఓయూ తెలిపింది. అయితే ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గడం, దసరా కూడా పూర్తవ్వగా తిరిగి పరీక్షల తేదీలను ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారమే ఓయూ పీజీ పరీక్షలు.. డిగ్రీవి మాత్రం వాయిదా! - ఓయూ యూజీ, పీజీ పరీక్షలు వాయిదా
దసరా తర్వాత జరగనున్న పీజీ పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని ఉస్మానియా యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ కేంద్రం తెలిపింది. పీజీ బ్యాక్‌లాగ్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయని.. డిగ్రీ పరీక్షలు మాత్రం వాయిదా పడ్డాయంది. వాటి షెడ్యూల్ను నవంబర్ మొదటి వారంలో ఓయూ ప్రకటించనుంది.
పరీక్ష తేదీలపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అన్ని రకాల పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు) మంగళవారం(అక్టోబర్ 27) నుంచి షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ప్రకటించింది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://www.osmania.ac.in/ లో చూసుకోవచ్చని పేర్కొంది. అయితే డిగ్రీ మొదటి నుంచి ఐదో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు వాయిదా పడ్డాయని ఉస్మానియా తెలిపింది. కొత్త షెడ్యూల్ను నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండిఃఈనెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన ఓయూ పరీక్షలు వాయిదా