'తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలి' - corona treatment in hospitals
17:27 May 04
ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు
కొవిడ్ రోగులకు చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య ఆరోగ్యశాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలని డీహెచ్ సూచించారు.
ఆక్సిజన్ 94 శాతం కంటే ఎక్కువుంటే హోం ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యపై హాస్పిటల్ బయట వివరాలు ఉంచాలని డీహెచ్ ఆదేశించారు. రోజురోజుకు ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోవడం, అవసరం లేకున్నా.. కొందరు జాయినై.. అత్యవసరమైన వారికి బెడ్ లేకుండా చేస్తున్నారన్న ఫిర్యాదులతో వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.