మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య - SUICIDE
22:57 October 13
మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కార్వాన్ ప్రాంతంలో నివసించే సురేందర్ గౌడ్, రాణిగంజ్ డిపోలో గత 15 సంవత్సరాలుగా కండక్టరుగా పనిచేస్తున్నాడు. తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఉద్యోగం పోయిందన్న మనస్తాపంతో సురేందర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు.