తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆయిల్​ ట్యాంకర్​ బోల్తా.. క్యాన్లు, బిందెలతో నూనె కోసం ఎగబడ్డ జనం.. - బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్

OIL TANKER: అసలే వంట నూనెల ధరలు మండుతున్నాయి. మరీ అలాంటి పరిస్థితిలో ఉచితంగా నూనె లభిస్తుందంటే ఎవరైనా ఊరుకుంటారా.. ఎగబడి తీసుకుంటారు. ఇక్కడ కూడా నూనెం కోసం జనం భారీ సంఖ్యలో వచ్చారు. ఇదంతా చూసి ఎవరో పంచుతున్నారు అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఆయిల్​ ట్యాంకర్​ బోల్తా పడటంతో భారీగా జనం గుమిగూడారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే?

OIL TANKER
ఆయిల్​ ట్యాంకర్

By

Published : Jul 20, 2022, 10:22 AM IST

ఆయిల్​ ట్యాంకర్ బోల్తా.. ఎగబడిన జనాలు..

OIL TANKER: ఏపీలోని పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద నార్కట్ పల్లి - అద్దంకి హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంచి నూనె ట్యాంకర్ అదుపు తప్పి ప్రధాన రహదారిపై బోల్తా పడింది. ట్యాంకర్​లో ఉన్న మంచి నూనె రోడ్డు పక్కనున్న గుంతలో పడి నిల్వ ఉండిపోయింది.

విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు.. నూనె తీసుకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో క్యాన్లు తీసుకుని వచ్చారు. నకరికల్లు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రజలు వినకపోవడంతో చేసేదేమిలేక వదిలేశారు. దీనితో రహదారిపై భారీ సంఖ్యలో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details