కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నా... తమకు తగిన గుర్తింపు లేకపోగా సరైన ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వడం లేదని... నిమ్స్ ఆసుపత్రి నర్సింగ్ స్టాఫ్ ఆందోళన బాట పట్టారు. నిధులు ఉన్నప్పటికీ తమకు రావాల్సిన ఇన్సెంటివ్‌లు ఇవ్వకపోవటం, పలు సమస్యలపై ఈ ఉదయం దాదాపు రెండు గంటలపాటు... అంతర్గత చర్చలు నిర్వహించిన అనంతరం విధులు బహిష్కరించారు.
నిమ్స్‌లో విధులు బహిష్కరించిన నర్సింగ్ సిబ్బంది - నిమ్స్‌లో సిబ్బంది నిరసన
సమస్యలు పరిష్కరించాలంటూ... నిమ్స్‌లో నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. నిమ్స్ డైరెక్టర్ హామీ ఇచ్చేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నిమ్స్ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది నిరసన
ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మనోహర్ స్వయంగా తమకు రాతపూర్వక హామీ ఇచ్చే వరకు విధుల్లో చేరేది లేదన్నారు. సుమారు 150 మంది నర్సింగ్ స్టాఫ్‌ను... ఫ్రంట్ వారియర్స్ అంటూ కితాబులు ఇవ్వటమే తప్ప... తమను పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు.
ఇదీ చూడండి:శాంతిభద్రతలపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
Last Updated : Oct 7, 2020, 1:57 PM IST