సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే సెంట్రల్ హాస్పిటల్ కొవిడ్-19 వార్డులకు తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీచేసింది. 9 మంది స్పెషలిస్ట్ వైద్యులు, 16 జీడీఎంఓలు, 31 నర్సింగ్ సూపరింటెండెంట్లు, 4 ల్యాబ్ అసిస్టెంట్లు, 50 మంది హాస్పిటల్ అటెండెంట్లను... కాంట్రాక్ట్ ప్రాతిపధికన భర్తీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 15 జులై 2020గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు... వీడియో కాల్ ద్వారా నిర్వహించబడతాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం scr.indianrailways.gov.inసందర్శించాలని సూచించారు.
రైల్వే సెంట్రల్ ఆసుపత్రిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ - రైల్వే కొవిడ్ ఆసుపత్రిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే సెంట్రల్ ఆసుపత్రిలో కొవిడ్-19 వార్డులకు తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి జులై 15 వరకు గడువు ఇచ్చారు. వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
రైల్వే సెంట్రల్ ఆసుపత్రిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్