హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ(kphb colony)కి చెందిన నూకాజీ నిత్యం ఇలా కొవిడ్(covid) పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు సరిగ్గా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని మైక్‌లో చెబుతుంటారు. ప్రధాన కూడళ్లు, కాలనీలు, జనసంచారం అధికంగా ఉండే కూరగాయలు, పండ్ల మార్కెట్లలో అవగాహన(covid awareness) కల్పిస్తున్నారు. రకరకాల వేషధారణలతో కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను నూకాజీ వివరిస్తున్నారు. ఓ రోజు పీపీఈ కిట్(ppe kits), మరో రోజు కరోనా భూతం.. ఇలా రకరకాల వేషధారణలతో కనిపిస్తూ కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు.
లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయా..
సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని, రోడ్డు దాటే సమయంలోనూ ఫోన్‌లో మాట్లాడవద్దని మైకులో వివరిస్తున్నారు. గతంలో వారాంతాల్లో శిల్పారామంలో ఉద్యోగం చేసేవాడినని, లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయానని నూకాజీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశ కొవిడ్‌లో సోదరుడికి వైరస్ సోకి మృతి చెందాడని... రెండో విడతలో తనకు వైరస్ సోకిందని .. మరెవరికి ఇలాంటి ఇబ్బంది తలెత్తకూడదనే ఈ తరహా అవగాహన కల్పిస్తున్నాని చెబుతున్నారు.