ప్రభుత్వం గంపగుత్తగా రాజీనామా చేస్తామంటే కేంద్రం.. రాష్ట్రానికి అదనంగా ఇచ్చిన నిధులపై చర్చకు సిద్దమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ విసిరారు. కేంద్రం ఇప్పటికే తక్షణ సహాయం కింద రహదారుల మరమ్మతుల కోసం రూ.224 కోట్లు విడుదల చేశామన్నారు. రాష్ట్రానికి.. కేంద్రం నుంచి విడుదలైన నిధుల జాబితా వివరాలను ఎంపీ విడుదల చేశారు.
'మీరు రాజీనామా చేస్తామంటే కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం'
విపత్తులు సంభవించినప్పుడు ఏంచేయాలో ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. కేటీఆర్కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గంపగుత్తగా రాజీనామా చేస్తామంటే కేంద్రం.. రాష్ట్రానికి అదనంగా ఇచ్చిన నిధులపై చర్చకు సిద్దమని అర్వింద్ సవాల్ విసిరారు.
విపత్తులు సంభవించినప్పుడు ఏంచేయాలో ప్రధాని మోదీ చూసి నేర్చుకోవాలని కేటీఆర్కు సూచించారు. తెలంగాణకు కేటీఆర్ మరో రాహుల్‌గాంధీలా తయారయ్యారని అరవింద్ ఎద్దేవా చేశారు. 2005లో గుజరాత్‌లో 2 లక్షల అక్రమణలు తొలగించామని అర్వింద్ తెలిపారు. అయినా ఆ ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 90శాతం సీట్లను భాజపా కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన రూ.10 వేల వరద సాయం నిధులు కూడా కేంద్రం ఇచ్చిందేనని అర్వింద్ వెల్లడించారు.
ఇవీచూడండి:వరద సాయంపై ప్రధానికి లేఖరాసినా స్పందించలేదు: కేటీఆర్