తెలంగాణ

telangana

ETV Bharat / city

బీమా కవరేజ్​లో పలు రాష్ట్రాల పరిస్థితి ఇలా..! - నీతి ఆయోగ్ నివేదిక

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఆరోగ్య బీమా కవరేజీలో నెలకొని ఉన్న పరిస్థితిపై నీతి అయోగ్ గణాంకాలు విడుదల చేసింది.

niti ayog report
niti ayog report

By

Published : Jul 14, 2021, 2:19 PM IST

2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఆరోగ్య బీమా కవరేజీలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితిపై నీతి అయోగ్ సర్వే గణాంకాలు విడుదల చేసింది. ఈ జాబితాలో బీమా కవరేజీలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్ 74.60 శాతంతో ముందంజలో ఉంది.

ఏపీలో ఆరోగ్య శ్రీ ద్వారా 2,436 రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియంలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. తెల్లరేషన్ కార్డుతో సంబంధం లేకుండా రూ.5లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారందరికీ వర్తింపజేయడంతో ఏపీలో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది.

niti ayog report

దేశంలో ఆరోగ్య బీమా విషయంలో ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మణిపూర్, అస్సాం, నాగాలాండ్​లలో ఆరోగ్య బీమాకలిగిన వారు అతికొద్ది మంది మాత్రమే. జమ్ముకశ్మీర్, లద్దాఖ్​లలోనూ ఆరోగ్య బీమా సౌకర్యం అరకొరే.

ఉత్తరాదిలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్​లో బీమా కలిగినవారు కేవలం 6.1 శాతం మాత్రమేనని నీతిఆయోగ్ వెల్లడించింది. బిహార్​లోనూ పరిస్థితి ఇంచుమించు ఇదే తరహాలో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. ఆరోగ్య బీమా కలిగిన బిహారీలు కేవలం 12.30 శాతం మాత్రమే.

దక్షిణాదిలో తెలంగాణలో 66.40 శాతం, తమిళనాడు 64 శాతం, కర్ణాటక 28.10శాతం, కేరళ 47.70శాతం మంది బీమా సౌకర్యం కలిగి ఉన్నారని నీతి ఆయోగ్ తెలిపింది.

మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా కేవలం 20శాతానికి అటు ఇటుగా మాత్రమే బీమా సౌకర్యం కలిగి ఉన్నారు. మహారాష్ట్రలో కేవలం 15శాతం మంది మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ కిందకు వచ్చినట్లు నీతిఆయోగ్ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి :దక్షిణాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం

ABOUT THE AUTHOR

...view details