కొత్త సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. టెక్నికల్ రిపోర్టు కోసం నలుగురు ఈఎన్సీలతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. ఆ నివేదికలను సీఎం కేసీఆర్కు సమర్పించినట్లు తెలిపారు. సచివాలయ నిర్మాణంపై ఎంఐఎం ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నూతన సచివాలయ భవన నమూనాలు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఇందుకోసం పూర్తి బడ్జెట్ ఇంకా కేటాయించలేదని తెలిపారు.
ఏడాదిన్నరలో కొత్త సచివాలయ నిర్మాణం: మంత్రి వేముల - new Secretariat construction
నూతన సచివాలయ భవన నమూనాలు ఇంకా ఖరారు కాలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నమూనాలను పరిశీలిస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ఏడాదిన్నరలోగా నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారని చెప్పారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
Last Updated : Sep 18, 2019, 1:35 PM IST