ఏపీలో కొత్తగా 14,986 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 84 మంది మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 60,124 కరోనా పరీక్షలు చేశారు. కరోనా నుంచి మరో 16,167 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,89,367 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో కొత్తగా 14,986 కరోనా కేసులు, 84 మంది మృతి
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొత్తగా ఆ రాష్ట్రంలో 14,986 మంది కొవిడ్ బారిన పడ్డారు. మహమ్మారి సోకి మరో 84 మంది మృతి చెందారు.
ఏపీలో కరోనా కేసులు, ఏపీ కరోనా వార్తలు, ఏపీలో కరోనా మరణాలు
తూర్పు గోదావరి జిల్లాలో జిల్లాలో 2,352 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. విశాఖ- 1,618, గుంటూరు-1,575, చిత్తూరు-1,543, నెల్లూరు-1,432, శ్రీకాకుళం-1,298, కడప-1,224 మందికి కొత్తగా వైరస్ సోకింది.
వైరస్ కారణంగా గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జిల్లాల్లో 12 మంది చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో-10, విశాఖ-9, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు.
- ఇదీ చదవండి :'మీలో మీరు బాధపడకండి.. మమ్మల్ని సంప్రదించండి'