ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 23,022 కరోనా(corona virus) పరీక్షలు నిర్వహించగా.. 310 కేసులు నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఏపీలో 20,57,562 మంది వైరస్ బారిన పడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్(covid) కారణంగా ఇద్దరు(corona deaths) మరణించారు. వైరస్ బారి నుంచి 994 మంది కోలుకోవడంతో ఏపీవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,36,048కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 7,258 యాక్టివ్ కేసులు(corona active cases) న్నాయి. మొత్తం ఇప్పటివరకు 2,87,67,963 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Corona Cases: ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు.. 2 మరణాలు - కరోనా వైరస్ వార్తలు
ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారినపడి ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు.. 2 మరణాలు
కరోనా వైరస్ బారినపడి ఇవాళ చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 54, నెల్లూరు జిల్లాలో 51 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: KCR Aerial view: మల్లన్నసాగర్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది.. సీఎం ఏరియల్ వ్యూ